Tuesday, 6 December 2016

పురిచ్చి తలైవి ఇక లేరు





జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది.

కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.





రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది. తమిళ నాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి...


జయలలిత_అసలు_పేరు_కోమలవల్లి.... తెలుగులో చేసిన చిత్రాలు....

కథానాయకుని కథ (1965)
మనుషులు మమతలు (1965)
ఆమె ఎవరు? (1966)
ఆస్తిపరులు (1966)
కన్నెపిల్ల (1966)
గూఢచారి 116 (1966)
నవరాత్రి (1966)
గోపాలుడు భూపాలుడు (1967)
చిక్కడు దొరకడు (1967)
ధనమే ప్రపంచలీల (1967)
నువ్వే (1967)
బ్రహ్మచారి (1967)
సుఖదుఃఖాలు (1967)
అదృష్టవంతులు (1968)
కోయంబత్తూరు ఖైదీ (1968)
తిక్క శంకరయ్య (1968)
దోపిడీ దొంగలు (1968)
నిలువు దోపిడి (1968)
పూలపిల్ల (1968)
పెళ్ళంటే భయం (1968)
పోస్టుమన్ రాజు (1968)
బాగ్దాద్ గజదొంగ (1968)
శ్రీరామకథ (1968)
ఆదర్శ కుటుంబం (1969)
కథానాయకుడు (1969)
కదలడు వదలడు (1969)
కొండవీటి సింహం (1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
కోటీశ్వరుడు (1970)
గండికోట రహస్యం (1970)
మేమే మొనగాళ్లం (1971)
శ్రీకృష్ణ విజయం (1971)
శ్రీకృష్ణసత్య (1971)
భార్యాబిడ్డలు (1972)
డాక్టర్ బాబు (1973)
దేవుడమ్మ (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
లోకం చుట్టిన వీరుడు (1973)
ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)



No comments:

Post a Comment